News May 4, 2024
తిరుపతి: PG కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU) నందు 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ (PG) ఆచార్య, ఎంఏ శబ్ద బోధ, ఎంఏ హిందీ, ఎమ్మెస్సీ యోగ థెరపి, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రమశ్రీ పేర్కొన్నారు. CUET ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://nsktu.ac.in వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 10.
Similar News
News April 11, 2026
మసీదులను రిజిస్ట్రేషన్ చేయాలి: చిన్నారెడ్డి

జిల్లాలోని మసీదులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. మసీదుల నిర్వహణ కమిటీలు, గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్, మౌజన్‌లు తమ మసీదుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉమీద్ పోర్టల్లో మసీదుల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 25 లోపు వీటిని పూర్తి చేయాలన్నారు.
News April 11, 2026
చిత్తూరు జిల్లాకు కొత్త పరిశ్రమల రాక

కుప్పంలో NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.2,550 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 400మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ కంపెనీకి 105 ఎకరాలు ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాంతిపురం(M) చీమనపల్లెలో రూ.989కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. రెండు దశల్లో 450మందికి ఉద్యోగాలు ఇస్తారు. వీటితో పాటు కుప్పం, శాంతిపురంలో పారిశ్రామిక పార్కులకు సైతం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
News April 11, 2026
పులిగుండు అభివృద్ధికి 79 ఎకరాలు కేటాయింపు

పెనుమూరు మండలంలోని ప్రముఖ పర్యటన కేంద్రమైన పులిగుండు అభివృద్ధికి 79 ఎకరాలు ఏపీ టూరిజానికి కేటాయిస్తూ నేడు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ అనేక సినిమా షూటింగ్‌లు, 1000 అడుగుల ఎత్తయిన రెండు రాతి కొండలు చూడ ముచ్చటగా ఉంటాయి. గత ఏడాది ఇక్కడ యోగ డేను జిల్లా అధికారులు నిర్వహించారు. ఆ ఫోటోలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన Xలో పోస్ట్ కూడా చేసుకున్నారు.


