News January 26, 2025

తిరుపతి: PHOTO OF THE DAY

image

తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద వెలసిన శ్రీవకుళ మాత ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం అద్భుతం చోటు చేసుకుంది. ఆకాశంలోని మేఘాలు నారింజ రంగు వర్ణంలో ప్రకాశిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. శ్రీవారి మాతృమూర్తి వకుళ ఆలయంపై వియ్యంకుడు ఆకాశరాజు ఇలా విచ్చేశాడా అన్నంత అందంగా ఉండటంతో ఆ సుందర మనోహర దృశ్యాలను భక్తులు, స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు.

Similar News

News November 18, 2025

‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

image

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్‌కౌంటర్‌లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.

వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

image

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.