News February 3, 2025
తిరుపతి: PIC OF THE DAY

కులమతాలకు అతీతంగా శ్రీకాళహస్తిలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మతసామరస్యానికి అతీతంగా ఓ ముస్లిం మహిళ వసంత పంచమి రోజున తన బిడ్డకు మఠాధిపతి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించింది. హిందూ, ముస్లిం ఐక్యతకు ఈ చిత్రం ప్రతీకగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు.
Similar News
News December 7, 2025
కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభం.. కూలీలకు ఉపాధి.!

దిత్వా తుఫాన్ అనంతరం వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా యంత్రాలపై ఆధారపడటంతో కూలీలకు ఉపాధి నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు యంత్రాల వినియోగాన్ని తగ్గించి, తిరిగి కూలీలతో వరి కోతలను ప్రారంభిస్తున్నారు. దీంతో నిలిచిపోయిన కూలీలందరికీ మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.
News December 7, 2025
హాజీపూర్: ఉద్యోగం వదిలి.. సర్పంచ్ బరిలో

హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామానికి చెందిన మనుబోతుల అలేఖ్య సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. హైదరాబాద్‌లోని HDFC బ్యాంక్‌లో సేల్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా మంచి ఉద్యోగాన్ని చేస్తున్న ఆమె, గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ప్రస్తుతం గిరిజన గ్రామమైన ర్యాలీ గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఆమె నిర్ణయం గ్రామంలోని యువతకు ఆదర్శంగా నిలిచింది.
News December 7, 2025
జాక్ పాట్ కొట్టిన సిక్కోలు కుర్రాడు.. రూ.92 లక్షలతో ఉద్యోగం

శ్రీకాకుళం పట్టణం బలగ సమీపంలోని శిరిడిసాయి నగర్‌కు చెందిన విద్యార్థి మెండ హిమవంశి రూ.92 లక్షల వార్షిక వేతనంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ అబ్బాయి ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్నాడు. దిల్లీకి చెందిన గ్రావిటన్ రీసెర్చ్ క్యాపిటల్ ఎల్.ఎల్.బి సంస్థ ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్‌కు ఎంపికయ్యాడు. పేరెంట్స్, టీచర్లు, కాలనీవాసులు కుర్రాడిని అభినందించారు.


