News November 21, 2024
తిరుపతి: SV ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి మృతి
డిగ్రీ విద్యార్థి మామండూరు వాటర్ ఫాల్స్ వద్ద మృతి చెందాడు. తిరుపతి SV ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్( సైకాలజీ) చదువుతున్న హేమాద్రి అనే విద్యార్థి గురువారం స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్‌కు వెళ్లాడు. అతని స్నేహితుడు వాటర్‌ఫాల్స్‌లో మునిగిపోతుండగా రక్షించే క్రమంలో మృతి చెందినట్లు సహచర స్నేహితులు తెలిపారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News December 5, 2024
తిరుపతి: గంజాయి కేసులో 17 మంది అరెస్ట్
గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు చేపడుతున్న 17 మందిని అరెస్టు చేసినట్టు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గురువారం తెలిపారు. శ్రీకాళహస్తి వన్ టౌన్, టూ టౌన్, BN కండ్రిగ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారన్నారు. నిందితుల నుంచి 32 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది ద్వారా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 5, 2024
తిరుపతి: కిడ్నాప్ కేసులో ఆరుగురు అరెస్ట్
తిరుపతిలో గత నెల 28న కిడ్నాప్ జరిగిన విషయం తెలిసిందే.పెనుమూరు(M) రేణుకానగర్ వాసి శ్రీనివాసులు(నాని) కొన్నేళ్ల క్రితం తిరుపతికి వచ్చాడు. మదనపల్లె వాసి సోనియాభానుతో సహజీవనం చేశాడు. నాని ప్రవర్తన నచ్చని ఆమె మదనపల్లెకు వెళ్లింది. సమీప బంధువుతో కలిసి నానిని కిడ్నాప్ చేసి కాలు, చేయి తీయించాలని ప్లాన్ వేసింది. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిని అరెస్ట్ చేశారు.
News December 5, 2024
చిత్తూరు: అభ్యంతరాలు ఉంటే తెలపండి
చిత్తూరు జిల్లాలోని మున్సిపల్, నగర పాలకోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాష పండితులకు SA లుగా పదోన్నతులు కల్పిస్తూ సీనియారిటీ జాబితా విడుదల చేస్తామని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఎంఈఓ, డివైఈవో మెయిల్ ద్వారా ఈ జాబితా పంపించామన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో 7వ తేదీ సాయంత్రం 4 లోపు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.