News February 4, 2025

తిరుపతి SVU దగ్గర 144 సెక్షన్

image

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అధికారులకు సవాల్‌గా మారింది. నిన్ననే ఎన్నిక జరగాల్సి ఉండగా.. కోరం లేక వాయిదా పడింది. తమ కార్పొరేటర్ల బస్సుపై దాడి చేశారంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది. కార్పొరేటర్ల బస్సుకు భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరికాసేపట్లో ఎస్వీయూ దగ్గరకు కార్పొరేటర్లు రానున్నారు. ఈ నేపథ్యంలో SVU దగ్గర 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు.

Similar News

News November 25, 2025

ఉద్యాన పంటలతోనే సీమ అభివృద్ధి: పయ్యావుల

image

AP: రాయలసీమలో రైతుల ఆదాయం పెరగాలంటే అది ఉద్యాన పంటలతోనే సాధ్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సీమలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు హార్టికల్చర్ సాగు విస్తీర్ణం పెరగాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. సీమలో సంపద సృష్టి, సిరి సంపదల వృద్ధి ఉద్యాన పంటలతో సాధ్యమవుతుందని, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుంటూ హార్టికల్చర్‌పై దృష్టి పెట్టాలన్నారు.

News November 25, 2025

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

image

సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో KMR(D)కు చెందిన నవవధువు మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం..బిచ్కుందకు చెందిన సాయికిరణ్‌కు 4 నెలల క్రితం SDPTకు చెందిన ప్రణతితో పెళ్లైంది. వీరిద్దరూ HYDలో ఉద్యోగం చేస్తున్నారు. SDPTలో ఓ ఫంక్షన్‌కు ‌హజరైన దంపతులు నిన్న బైకుపై HYD వెళ్తుండగా పెద్దచెప్యాల వద్ద ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి మృతి చెందగా, సాయికిరణ్ గాయపడ్డాడు.

News November 25, 2025

సూర్యాపేట: నామినేషన్ వేస్తే ఏకగ్రీవమే!

image

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నూతనకల్ మండలం పెదనెమిల జీపీలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. పెదనెమిల జీపీలోని 1వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎస్టీ వర్గానికి చెందిన ఓటరు ఒక్కరే ఉండటం విశేషం. నామినేషన్ వేసే ప్రక్రియ పూర్తయితే, వార్డు మెంబర్ ఏకగ్రీవం కానుంది.