News July 13, 2024
తిరుపతి: SVU సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తిరుపతి: SVU పరిధిలో ఈ ఏడాది మే నెలలో డిగ్రీ (UG) 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు శనివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. ఆరో సెమిస్టర్ ఫలితాలు వీలైనంత త్వరగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కళాశాలల నుంచి వైవా (Viva) మార్కులు రావాల్సి ఉందని అన్నారు.
Similar News
News October 30, 2025
బాధిత కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ సాయం

ప్రమాదాలకు గురైన పోలీసు కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ గురువారం ఆర్థిక సాయం అందజేశారు. చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మురుగేషన్, సాయుధ దళంలో విధులు నిర్వహిస్తున్న రవితేజ నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులకు IDRF ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఎస్పీ చెక్కులను అందజేశారు. కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
News October 30, 2025
తుఫాన్‌ను సీఎం అద్భుతంగా ఎదుర్కొన్నారు: MP

చిత్తూరు: మొంథా తుఫాన్‌ను సీఎం చంద్రబాబు అపార అనుభవంతో అద్భుతంగా ఎదుర్కొన్నారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కొనియాడారు. ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారించగలిగామని తెలిపారు. బాధితులకు సహాయం, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రజలకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన అభినందించారు.
News October 30, 2025
చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో తుఫాను నష్టంపై నవంబర్ 5వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నష్ట గణన ప్రక్రియపై బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.


