News January 26, 2025

తిరుపతి: TTD రూ.27 లక్షల పరిహారం చెల్లింపు

image

తోపులాటలో మృతి చెందిన కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌కు చెందిన వి.నిర్మల కుటుంబానికి రూ.27 లక్షల పరిహారాన్ని టీటీడీ బోర్డు సభ్యులు శనివారం అందజేశారు. టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు రూ.25 లక్షలు, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సొంత నిధులు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.27 లక్షలు అందజేశారు. మృతురాలు నిర్మల ఏకైక కుమార్తె కౌశిగాకు పరిహారం చెక్‌ను అందించారు.

Similar News

News September 15, 2025

NLG: 17 నుంచి పోషణ మాసం షురూ

image

ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు మాతా శిశు సంరక్షణ కోసం అధికారులు పోషణ మాసం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషణ్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమంగా భావించి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నల్గొండ జిల్లాలోని 2,093 అంగన్వాడి కేంద్రాల్లో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసం నిర్వహించనుంది. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు చూసి రిజిస్టర్లో నమోదు చేయనున్నారు.

News September 15, 2025

సంగారెడ్డి జిల్లాలో గేమ్స్ వాయిదా

image

సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 16, 17న జరగాల్సిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను వాయిదా వేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. పోటీలు నిర్వహించాల్సిన మైదానాలు వర్షం నీటితో నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 15, 2025

MHBD: ఘోరం.. యూరియా కోసం వెళ్లి మృత్యుఒడికి

image

యూరియా కోసం వెళ్లిన ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బొద్దుగొండకు యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా గూడూరు మండలంలో జగన్ నాయకులగూడెం వద్ద వేగంగా వచ్చిన బోలెరో వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దారావత్ వీరన్న, బానోత్ లాల్య అనే ఇద్దరు రైతులు మృతి చెందారు. ఇంటికి యూరియా బస్తా తెస్తారని ఎదురుచూస్తున్న వారి కుటుంబాలకు ఇది తీరని విషాదాన్ని మిగిల్చింది.