News March 25, 2024
తిరుపతి: YCPని వీడిన వారికి జాక్‌పాట్..!

YCP చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయానంద రెడ్డిని ప్రకటించడంతో MLA శ్రీనివాసులు జనసేన గూటికి చేరారు. ఆయనకు తిరుపతి MLA టికెట్ ఇచ్చారు. గూడూరు MLA వరప్రసాద్‌కు మరోసారి టికెట్ ఇవ్వడానికి YCP నిరాకరించగా BJPలో చేరారు. తిరుపతి MP టికెట్ దక్కించుకున్నారు. ఈ రెండు సీట్ల కోసం టీడీపీ, బీజేపీలో చాలా మంది సీనియర్లు పోటీ పడినా వీరికే దక్కడం విశేషం. రానున్న ఎన్నికల్లో తిరుపతి ఓటర్లకు సైకిల్ గుర్తు కనపడదు.
Similar News
News December 16, 2025
పుంగనూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం

పుంగనూరు మండలంలోని సుగాలి మిట్ట వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఆగి ఉన్న లారీని మరో మినీ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడ్డవారు తమిళనాడుకు చెందిన ప్రదీప్, శివ శంకర్, అశోక్‌గా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
News December 15, 2025
కుప్పంలో CBG ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్

క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఊతమిస్తూ AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024’ కింద కుప్పం (M) కృష్ణదాసనపల్లిలో 10 TPD సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్‌ను శ్రేష్ఠా రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. నేపియర్ గడ్డి, సేంద్రీయ వ్యర్థాలతో CBGతో పాటు ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ (PROM) ఉత్పత్తి చేయనున్నారు.
News December 15, 2025
చిత్తూరు: 43 ఫిర్యాదుల స్వీకరణ

చిత్తూరు జిల్లాలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి 43 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చీటింగ్–3, కుటుంబ తగాదాలు–5, వేధింపులు–3, భూ తగాదాలు–10, ఇంటి తగాదాలు–5, డబ్బు తగాదాలు–8, ఆస్తి తగాదాలకు సంబంధించిన 9 ఫిర్యాదులు అందాయన్నారు.


