News May 11, 2024
తిరుమలకు నేడు చంద్రబాబు నాయుడు రాక..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కుప్పం పర్యటన అనంతరం శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5 గంటల తరువాత ప్రచారం చేయకూడదని నిబంధనలు ఉన్న తరుణంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
Similar News
News February 15, 2025
చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశం

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ ప్రసాదరావు హాజరయ్యారు. పలు అంశాలపై అధికారులతో వారు చర్చించారు. జడ్పీ సీఈవో రవి కుమార్ నాయుడు, అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, రవి కుమార్, గోపాల్ నాయక్, వరలక్ష్మి తదితరులు హాజరయ్యారు.
News February 15, 2025
చిత్తూరు: ‘ ప్రేమోన్మాది టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి కుమారుడే’

ఉమ్మడి చిత్తూరు జిల్లా గుర్రంకొండలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేసిన ఘటన రాష్ట్రంలో సంచలమైంది. కాగా నిందితుడు టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపించింది. కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళి కుమారుడే గణేశ్ అని ట్వీట్ చేసింది. గణేశ్ తండ్రికి టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ పలు ఫొటోలను పోస్ట్ చేసింది. మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ యువతికి బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు.
News February 14, 2025
చిత్తూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే, ఎంపీల చర్చలు

చిత్తూరు పార్లమెంటు కార్యాలయంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చిత్తూరు అభివృద్ధి పై చర్చించుకున్నారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉద్గాటించారు.