News August 4, 2024
తిరుమలకు వచ్చే వృద్ధులకు అలర్ట్
టోకెన్లు లేకున్నా రోజూ వయోవృద్ధులను శ్రీవారి దర్శనానికి నేరుగా అనుమతిస్తున్నారని కొందరు ప్రచారం చేశారు. దీనిని టీటీడీ ఖండించింది. ‘రోజుకు 1000 మంది చొప్పున వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రతి నెలా 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటా విడుదల చేస్తాం. అలా బుక్ చేసుకున్న టోకెన్లతో వచ్చిన వారినే దర్శనానికి అనుమతిస్తాం. టోకెన్లు లేని వారికి అనుమతి లేదు’ అని TTD స్పష్టం చేసింది.
Similar News
News September 10, 2024
వాళ్లను వెంటనే రిలీవ్ చేయండి: చిత్తూరు DEO
చిత్తూరు జిల్లాలో అన్ని పాఠశాలల్లో టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసినట్లు DEO దేవరాజులు వెల్లడించారు. జిల్లాలో మొత్తంగా 464 మంది టీచర్లను సర్దుబాటు చేసినట్లు చెప్పారు. ఆయా టీచర్లను ఎంఈవోలు, HMలు వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు.
News September 9, 2024
శ్రీవారి ఆలయ పేష్కార్‌గా రామకృష్ణ
తిరుమల శ్రీవారి ఆలయ నూతన పేష్కార్‌గా రామకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం ఆలయ రంగనాయకుల మండపం వద్ద బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు, ఆలయ సిబ్బంది రామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
News September 9, 2024
చిత్తూరు: విద్యార్థి దారుణ హత్య..?
ఉమ్మడి చిత్తూరులో డిగ్రీ విద్యార్థి మృతి కలకలం రేపింది. PTM మండలం ముంతగోగులపల్లెకు చెందిన గోపాలకృష్ణ, వెంకట రమణమ్మ కుమారుడు బాలు(18) తిరుపతిలో డిగ్రీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం భూమిని సర్వే చేయించగా.. ఆదివారం నుంచి అదృశ్యమయ్యాడు. ఊరికి చివరలోని గుడి వద్ద సోమవారం శవమై కనిపించాడు. భూవివాదంతో తమ బంధువులు బాలును చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.