News March 27, 2025
తిరుమల:టీటీడీకి రూ.2.45 కోట్లు విరాళం

టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గురువారం రూ.2.45 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్ ఫ్రా వెంచర్స్ సంస్థ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించగా, శ్రీలంకకు చెందిన ఓ దాత అన్న ప్రసాదం ట్రస్టుకు మరో రూ.కోటి విరాళంగా అందించారు. నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించింది.
Similar News
News November 9, 2025
HEADLINES

* నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన PM మోదీ
* పెట్టుబడుల సాధనకు లోకేశ్ తీవ్ర కృషి: సీఎం చంద్రబాబు
* ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తాం: పవన్
* కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం: సీఎం రేవంత్
* రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేసినా భయపడను: కిషన్ రెడ్డి
* వర్షం కారణంగా IND Vs AUS చివరి టీ20 రద్దు.. 2-1తో సిరీస్ భారత్ వశం
* స్థిరంగా బంగారం, వెండి ధరలు
News November 9, 2025
మాగంటి మృతిపై విచారణ జరపాలని తల్లి ఫిర్యాదు

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మాగంటి మరణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <<18218398>>కేటీఆర్ను<<>> ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
News November 9, 2025
కమనీయంగా వేములవాడ రాజన్న కళ్యాణం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్లో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు రాజన్న ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణం జరిపించారు.


