News March 17, 2025
తిరుమల:తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది.మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయించనున్నట్లు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తెలంగాణా సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించనున్నట్లు తెలిపారు. బుధ,గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించనున్నట్లు ‘X’ వేదికగా టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.
Similar News
News March 18, 2025
ఎర్రగుంట్లలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం

ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని కడప రోడ్డులోని మై హోమ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన గండులూరి ఖాదరయ్య(41) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 18, 2025
లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ

కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను మెగాస్టార్కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.
News March 18, 2025
VKB: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి

వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నియామకమయ్యారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం బీజేపీ సీనియర్ నాయకులు శివరాజ్, సదానందరెడ్డి, రమేశ్, కేపీ రాజు, వడ్ల నందు, రాజశేఖర్ రెడ్డి పోటీ పడ్డారు. కాగా అధ్యక్ష పదవి రాజశేఖర్ రెడ్డికి వరించింది. తన నియామకానికి సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.