News November 18, 2024
తిరుమలలో అన్యమత ప్రచారం.. ఇద్దరిపై కేసు
పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థాన పాపవినాశనం ఆవరణంలో అన్యమత ప్రచారానికి పాల్పడ్డ ఇద్దరు మహిళలపై తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాపవినాశనం వద్ద శంకరమ్మ, మీనాక్షి భక్తుల ముందే ఆదివారం ఓ మతానికి సంబంధించి పాటలకు రీల్స్ చేయడం పెను దుమారం రేపింది. దీంతో భక్తుల ఫిర్యాదు మేరకు టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 18, 2024
పోలీసులపై ప్రివిలేజ్ మోషన్: తిరుపతి MP
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్తే కనీసం తీసుకోవడానికి కూడా వారు ఆసక్తి చూపలేదని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై జుగుప్సాకర పోస్టులను పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా తదితరులతో కలిసి ఆయన ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 40 నిమిషాల పాటు తమను పట్టించుకోలేదని, వారిపై ప్రివిలైజేషన్ మూవ్ చేస్తామని హెచ్చరించారు.
News November 18, 2024
నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 గం.ల నుంచి మ.1 గం.వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 17, 2024
గుర్రంకొండ ASI మోసెస్‌పై కేసు నమోదు
గుర్రంకొండ ASI మోసెస్‌పై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రెండో పట్టణ SI రవి కుమార్ తెలిపారు. ఏఎస్ఐ మోసెస్ 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటూ తనను పట్టించుకోకపోవడమే కాకుండా అదనపుకట్నం కోసం వేధిస్తున్నాడని ఆయన భార్య ఎస్తర్ రాణి శనివారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రామచంద్ర ఆదేశాలతో ఎస్ఐ విచారణ చేపట్టి ఏఎస్ఐపై కేసు చేశారు.