News April 3, 2025
తిరుమలలో: ఆ భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

తిరుమల శ్రీవారికి రూ.కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజుల్లో మినహా మిగిలిన రోజుల్లో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు. దాతతో పాటు నలుగురికి సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల సుపథం ప్రవేశ దర్శనం ఉంటుంది. వసతి, ప్రసాదం పొందవచ్చు.
Similar News
News November 17, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించిన కలెక్టర్

టేక్మాల్ మండలంలో వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశం మీద సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా అన్ని గ్రామాల వారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

గంజాయి టెస్ట్.. స్పాట్లోనే రిజల్ట్స్!

TG: గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్నవారిని ‘యూరిన్ టెస్ట్ కిట్’తో టెస్ట్ చేసి స్పాట్లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు. సైబరాబాద్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా పీఎస్లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.