News February 27, 2026

తిరుమలలో కొత్త విధానం..!

image

తిరుమలలో భక్తులు ముడుపులుగా సమర్పించే చిల్లర నాణేల స్థానంలో పత్రాలు వేసేలా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. చాలామంది క్యూలైన్లలో కాయిన్స్ తీసుకెళ్లడం కష్టం అవుతోంది. ఇకపై పేమెంట్ యాప్ ద్వారా నగదు చెల్లిస్తే పత్రాన్ని ఇస్తారు. దీన్ని మీరు హుండీలో వేయవచ్చు. దీనిపై TTD బోర్డు త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పత్రానికి సంబంధించి ఓ నమూనాను పై ఫొటోలో చూడవచ్చు.

Similar News

News April 16, 2026

రేపు ప.గో జిల్లాలో అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం

image

భీమవరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 11 గంటలకు గంగానమ్మ గుడి వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె సూచించారు.

NRPT: ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో గుర్తించిన ప్రమాదం జరిగే స్థలాల్లో ప్రమాదాలు జరగకుండా రోడ్ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఎస్పీ డాక్టర్ వినీత్ తో కలసి రోడ్ సేఫ్టీ సమావేశం నిర్వహించారు. అధికారులు పాల్గొన్నారు.