News March 15, 2025
తిరుమలలో ఘోర అపచారం: రోజా

ప్రభుత్వంపై రోజా సంచలన ట్వీట్ చేశారు. ‘పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఘోర అపచారం. ఓ మందుబాబు కొండపైన వీరంగం సృష్టించాడు. ఎవరికి ఎంత మందు కావాలంటే అంత అమ్ముతాడంట. కూటమి ప్రభుత్వంలో తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ వీడియోనే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని ఏరులైపారిస్తున్నారు. ఇప్పుడది తిరుమలకు కూడా చేరింది. దేవుడా.!’ అంటూ రోజా ట్వీట్ చేశారు.
Similar News
News February 15, 2026
శివుడు తనలో సగ భాగాన్ని పార్వతికి ఎందుకు ఇచ్చాడు?

పార్వతీదేవి శివునిపై అచంచలమైన భక్తితో కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు, ఆమెను తనలో భాగంగా చేసుకున్నాడు. దీనివల్ల లోకానికి పురుషుడు (శివుడు – చైతన్యం), స్త్రీ (పార్వతి – శక్తి) వేర్వేరు కాదని ఈ రెండింటి కలయికతోనే సృష్టి నడుస్తుందని నిరూపించారు. ఇద్దరూ సమానమేనని, ఒకరు లేనిదే మరొకరు సంపూర్ణులు కారని ఈ రూపం చెబుతుంది. భక్తుడు భగవంతుడిలో లీనమవ్వడాన్ని కూడా ఇది సూచిస్తుంది.
News February 15, 2026
‘శివోహం జాగరణ’లో సీఎం: పటిష్ట భద్రత

మహాశివరాత్రి సందర్భంగా నంబూరు వద్ద ఆదివారం రాత్రి నిర్వహించిన ‘శివోహం జాగరణ’కు సీఎం హాజరయ్యారు. ఎస్పీ వకుల్ జిందల్, కలెక్టర్ తమీమ్ అన్సారియా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పటిష్ట నిఘా ఉంచారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
News February 15, 2026
బాపట్లలో పండగ పూట విషాదం

బాపట్లలో పండగపూడ విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు కారుమూరి సతీష్ (35) విద్యుత్ షాక్‌తో మరణించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సతీష్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌గా పనిచేస్తూ అందరికి సుపరిచితుడయ్యాడన్నారు. యువ నాయకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు.


