News April 29, 2024
తిరుమలలో జరిగే ఉత్సవాలు ఇవే

తిరుమలలో శ్రీవారి గురువు జగద్గురు భగవద్ శ్రీరామానుజ ఉత్సవాలు మే 3న ప్రారంభం అవుతాయి. 4న సర్వ ఏకాదశి, 10న అక్షయ తృతీయ నిర్వహిస్తారు. 12న జగద్గురు భగవద్ శ్రీ రామానుజ(శ్రీ భాష్యకారుల) శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుపుతారు. 22న నృసింహ జయంతి, నమ్మాల్వార్ వార్షిక శాత్తుమొర, 23న అన్నమాచార్య జయంతి జరుగుతుంది.
Similar News
News December 9, 2025
చిత్తూరు కలెక్టర్ హెచ్చరికలు ఇవే..!

చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘాతో పాటు అవగాహన సదస్సులు కూడా నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీసీ & పీఎన్డీటీ చట్టం కింద జిల్లాస్థాయి బహుళ సభ్యుల అప్రూవింగ్ అథారిటీపై సమీక్షించారు.
News December 9, 2025
చిత్తూరు: హైవేల అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్

కుప్పం, కాణిపాకం జాతీయ రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. కుప్పం, హోసూర్, బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే, కాణిపాకం టెంపుల్ లింక్ రోడ్డు-NH 140 సంబంధించి కనెక్టివిటీ అంశాన్ని కేంద్రానికి సమర్పించగా ఆమోదం తెలిపినట్టు చెప్పారు. దీంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
News December 9, 2025
చిత్తూరు నూతన DEOగా రాజేంద్ర ప్రసాద్

చిత్తూరు జిల్లా నూతన డీఈవోగా రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం బుక్కపట్నం డైట్ కాలేజీ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మరో వారంలో ఆయన డీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తారని సమాచారం. ప్రస్తుత చిత్తూరు డీఈవో వరలక్ష్మిని కార్వేటినగరం డైట్ కాలేజీకి బదిలీ చేయనున్నారు.


