News February 7, 2025
తిరుమలలో దంపతుల ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738930249710_689-normal-WIFI.webp)
తిరుమలలో విషాద ఘటన జరిగింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు(60), అరుణ(55) దంపతులు తిరుమల నందకం గెస్ట్ హౌస్లో గురువారం రూము తీసుకున్నారు. నిన్నటి నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బంది పోలీసులకు ఇవాళ సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్లు తెరిచారు. దంపతులు ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 8, 2025
సంగారెడ్డి: 9న ఎన్నికల విధులపై అధికారులకు శిక్షణ: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738913789049_52434823-normal-WIFI.webp)
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం తెలిపారు. ఈ శిక్షణకు విధులు కేటాయించిన అధికారులందరూ హాజరు కావాలని సూచించారు.
News February 8, 2025
బెల్లంపల్లి: చోరీకి పాల్పడిన అనుమానితుని ఫోటో విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738935113608_51297756-normal-WIFI.webp)
బెల్లంపల్లి పట్టణంలో బ్యాంకు డబ్బులు విత్ డ్రా చేసుకొని వెళుతున్న బట్వాన్పల్లి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి నుంచి నగదు చోరీ చేసిన నిందితుల అనుమానిత ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వన్ టౌన్ SHO దేవయ్య మాట్లాడుతూ.. చోరీ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ కొనసాగిస్తున్నామన్నారు. నిందితుడిని గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు.
News February 8, 2025
‘వందే భారత్’లో ఫుడ్.. రైల్వే కీలక నిర్ణయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738950883864_695-normal-WIFI.webp)
వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు రైల్వే శాఖ మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోని వారికి కూడా అప్పటికప్పుడు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. అయితే రాత్రి 9 గంటలలోపు మాత్రమే ఫుడ్ బుక్ చేసుకోవాలి. ప్రయాణాల్లో ఆహారం దొరకడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు IRCTC పేర్కొంది. క్వాలిటీ ఫుడ్ అందించాలని సంబంధింత విభాగాలను ఆదేశించింది.