News February 7, 2025
తిరుమలలో దంపతుల ఆత్మహత్య

తిరుమలలో విషాద ఘటన జరిగింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు(60), అరుణ(55) దంపతులు తిరుమల నందకం గెస్ట్ హౌస్‌లో గురువారం రూము తీసుకున్నారు. నిన్నటి నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బంది పోలీసులకు ఇవాళ సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్లు తెరిచారు. దంపతులు ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 28, 2025
నత్తనడకన LRS ఫీజు చెల్లింపు ప్రక్రియ

ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 35వేల కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. జిల్లాలో 1,00,800 మంది దరఖాస్తు చేయగా 7,829 మంది మాత్రమే సొమ్ములు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.
News March 28, 2025
వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో ఉద్యోగులు ఫెయిల్!

ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విషయంలో సంతృప్తిగా లేనట్లు ‘జీనియస్ కన్సల్టెంట్స్’ సర్వేలో తేలింది. పని వేళల వల్ల రెండింటినీ మేనేజ్ చేయలేకపోతున్నామని 52% మంది అభిప్రాయపడ్డారు. ప్రతి ముగ్గురిలో ఒక్కరే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. పనికి తగ్గ వేతనాలు కంపెనీ చెల్లించట్లేదని 68% మంది భావిస్తున్నారు. మెంటల్ హెల్త్, శ్రేయస్సు గురించి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తే సంతోషపడతామని 89% మంది చెప్పారు.
News March 28, 2025
HYD: బస్టాప్ ఎక్కడుందో తెలుసుకోవడం ఈజీ..!

ఆర్టీసీ బస్టాప్ మీ దగ్గరలో ఎక్కడుందో తెలుసుకోవడం ఇక చాలా ఈజీ. HYD పట్టణానికి కొత్తగా వచ్చిన ఎంతో మందికి ఈ ప్రాంతం తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి RTC గుడ్ న్యూస్ తెలిపింది.TGSRTC గమ్యం యాప్ ఓపెన్ చేసి ‘బస్ స్టాప్ నియర్ మీ’ అనే ఆప్షన్ ఎంచుకుంటే, ఫొటోలో చూపిన విధంగా మీ దగ్గరలో బస్టాప్ ఎక్కడుందో చూపిస్తుంది. లొకేషన్ పట్టుకుని వెళ్తే సరిపోతుంది. ఫోటోలోనిది ఉప్పల్ చర్చ్ బస్‌స్టాప్.