News January 24, 2025
తిరుమలలో పలు సేవలు రద్దు
రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఫిబ్రవరి 4వ తేదీన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. NRIలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Similar News
News January 26, 2025
చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
చిత్తూరు నగరం మురుకంబట్టు సమీపంలో ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బిహార్కు చెందిన విద్యార్థిని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. దీంతో ఆదివారం ఉరేసుకుని మృతి చెందిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 26, 2025
బంగారుపాలె: లోయలోకి దూసుకెళ్లిన లారీ
బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో ఒకరు మృతి చెందారు. బెంగళూర్ నుంచి చిత్తూరు వైపు వస్తున్న కంటైనర్ అతివేగంగా రావడంతో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
News January 26, 2025
చిత్తూరు: పెళ్లి పేరుతో వంచన
ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై పొక్సో కేసు నమోదైన ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసింది. కలికిరి సీఐ రెడ్డి శేఖరరెడ్డి వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా రొంపిచర్లకు చెందిన యువతి కలికిరి మండలంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ వాయల్పాడులో ఇంటర్ చదువుతోంది. ఈక్రమంలో అమ్మమ్మ ఊరిలోని జునైద్ అహమ్మద్తో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని వంచించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.