News January 24, 2025

తిరుమలలో పలు సేవలు రద్దు

image

రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఫిబ్రవరి 4వ తేదీన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. NRIలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Similar News

News February 18, 2025

చిత్తూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై <<>>క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

News February 18, 2025

MNCL: MLC ఎన్నికల్లో విజయం బీజేపీదే: బండి సంజయ్

image

రాష్ట్రంలో ఈ నెల 27న జరగబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసం, భరోసా, ప్రజల పక్షాన బీజేపీ చేసిన పోరాటం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ గెలుపునకు బాటలు అని పేర్కొన్నారు.

News February 18, 2025

ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటి వాయిదా పడింది.

error: Content is protected !!