News April 13, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18-20 గంటల సమయం పడుతోందని సమాచారం. కంపార్ట్మెంట్లన్నీ నిండి MBC వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 72,923 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,571 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.3.33 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఆదివారం వెల్లడించింది.
Similar News
News September 18, 2025
HYD: 40% పెరిగిన వాహనాల సంఖ్య

6ఏళ్లలో HYD రోడ్లపై వాహనాల సంఖ్య 40% పెరిగింది. రోజుకు 1,500 నుంచి 2 వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. సిటీలోని మొత్తం వాహనాల్లో 63 లక్షల బైకులు, 16 లక్షల కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. కిలోమీటర్ రోడ్డుపై దాదాపు 8వేల టూవీలర్లు, 2 వేల కార్లు కనిపిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
News September 18, 2025
లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
HYD: పార్కులు కాపాడిన హైడ్రా.. హెచ్చరిక బోర్డులు

హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని పార్కు స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించారు. కూకట్పల్లి మూసాపేట సర్కిల్లోని సనత్నగర్ కోఆపరేటివ్ సొసైటీ లే ఔట్లో 1600 గజాల భూమిని, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో పార్కు కోసం కేటాయించిన 600ల గజాల స్థలాన్ని కాపాడారు. ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.