News January 30, 2025

తిరుమలలో ఫిబ్రవరిలో ప్రత్యేక కార్యక్రమాలు

image

తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో ప్రత్యేక కార్యక్రమాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. ఫిబ్రవరి 02న వసంత పంచమి, ఫిబ్రవరి 04న రథసప్తమి, ఫిబ్రవరి 05న భీష్మాష్టమి, ఫిబ్రవరి 06న మాధ్వ నవమి, ఫిబ్రవరి 08న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి, మాఘ పూర్ణిమ జరగనుంది. ఫిబ్రవరి 24న సర్వ ఏకాదశి, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు.

Similar News

News November 2, 2025

విశాఖ: ఉద్యోగాల పేరిట మోసం

image

గాజువాకలో ఓ మహిళ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసింది. సత్యవతి తను న్యాయవాదినని జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీను, కొండబాబును నుంచి రూ.4,04,500 వసూలు చేసింది. ఉద్యోగాలు రాకపోవడంతో వారు అడగ్గా.. నేను లాయర్‌ను నాపై ఎలాంటి చర్యలు తీసుకోలేరంటూ ఎదురుతిరిగిందని బాధితులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవతిని ఆమె సహాయకులు అప్పలరమణ, సదాశిరావును శనివారం అరెస్ట్ చేశారు.

News November 2, 2025

కల్తీ కుంకుమని ఇలా గుర్తించండి

image

కొనే ముందే కుంకుమలోని కల్తీని కనిపెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని చిట్కాలు..* నేచురల్ కలర్ కాకుండా గులాబీ, కాషాయం, మరీ ముదురుగా ఉంటే కృత్రిమ రంగులు వాడారని అర్థం. * సహజంగా చేసిన కుంకుమ రంగు చేతికి అంటుకోదు.. అదే అంటుకుందని గుర్తిస్తే కల్తీ చేశారని అర్థం. * గ్లాసీ లుక్‌ ఉండే కుంకుమల్లో హానికారక డైలు కలిపినట్లే. * నకిలీ కుంకుమైతే నీళ్లలో కలిపితే కరిగిపోకుండా నీటి రంగు మారుతుంది.

News November 2, 2025

నూజివీడులో నేటి మాంసం ధరలు ఇలా

image

నూజివీడులో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ రూ.800, చికెన్ రూ.200 నుంచి 220 రూపాయలు, చేపలు కిలో రూ.180 రూపాయల నుంచి 350 రూపాయల వరకు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలు, ఏలూరు నగరంలో మటన్ కిలో రూ.900, చేపలు కిలో రూ.200 నుంచి 380 రూపాయలు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలుగా విక్రయిస్తున్నారు.