News November 30, 2024

తిరుమలలో వయోవృద్ధుల దర్శనాలపై ఫేక్ ప్రచారం!

image

తిరుమల వయోవృద్ధుల దర్శనాలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అవుతోంది. వాస్తవానికి సీనియర్ సిటీజన్ల దర్శనం ఆన్‌లైన్లో బుక్ చేసుకున్నవారికి మాత్రమే రోజూ మధ్యాహ్నం 3గంటలకు ఉంటుంది. నేరుగా వస్తే అనుమతించరు. రోజు 1000 మందికి మాత్రమే ఈ కోటాలో దర్శనాలు కేటాయిస్తున్నారు. కానీ 65 ఏళ్లు దాటినవారు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు మధ్య ఫొటో ఐడీ, వయసు ధ్రువీకరణ పత్రం చూపిస్తే దర్శనం అయిపోతుందని ప్రచారం జరుగుతోంది.

Similar News

News January 22, 2026

చిత్తూరు: పక్క జిల్లాలోకి మారిన పోలీస్ స్టేషన్లు.!

image

పుంగనూరు నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లను అన్నమయ్య జిల్లాలోకి కలుపుతూ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విజయ్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మండలాలలోని స్టేషన్లను మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో చేర్చారు. ఇది డిసెంబర్ 31 నుంచి అమలులోకి వచ్చినట్లు భావించాలని పేర్కొన్నారు.

News January 22, 2026

చిత్తూరు: 71 సెంటర్లలో ఇంటర్ ప్రాక్టికల్స్

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణపై తన కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష చేశారు. 71 సెంటర్లలో నిర్వహించే పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11వేల మంది హాజరవుతారని చెప్పారు.