News August 22, 2024
తిరుమలలో వివిధ ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వివిధ ప్రత్యేక దర్శనాలు కూడా అక్టోబరు 3నుంచి 12వ తేదీ వరకు రద్దయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు భక్తులు అధికంగా వచ్చేస్తారు. వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
Similar News
News July 11, 2025
త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
News July 11, 2025
కుప్పం రైతులకు రూ.25.90 కోట్ల నష్టపరిహారం

కుప్పం ఎయిర్పోర్ట్ కోసం 2018లో భూములు ఇచ్చిన రైతులకు వడ్డీతో కలిపి ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. పలువురు రైతులకు కడ పీడీ వికాస్ మర్మత్, MLC శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం, RDO శ్రీనివాసరాజు గురువారం రూ.25.90 కోట్ల చెక్కులను అందజేశారు. మండలాల వారీగా రైతులకు నష్టపరిహారం అందివ్వడం జరుగుతుందని MLC తెలిపారు. భూ సేకరణకు రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
News July 10, 2025
పూతలపట్టు: గోడ కూలి మహిళ మృతి

పూతలపట్టు మండలం బందర్లపల్లి గ్రామంలో కూలి మృతి చెందింది. మూర్తిగాను గ్రామానికి చెందిన మల్లిక అనే మహిళ బందర్లపల్లి గ్రామంలో పని చేస్తూ ఉండగా ఆమెపై గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించినట్లు పేర్కొన్నారు.