News April 1, 2025
తిరుమలలో వైఫల్యాలపై PMకి లేఖ

తిరుమలలో వరుస భద్రత వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి, హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో చనిపోవడం, నాన్ వెజ్ పదార్థాలను కొండపైకి తీసుకెళ్లడం, మతిస్థిమితం లేని వ్యక్తి బైక్‌పై తిరుమల కొండపైకి వెళ్లిన ఘటనలను లేఖలో పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
ప్రధాని మోదీకి యూనస్ బహుమతి

బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ విజ్ఞప్తి మేరకు ప్రధాని మోదీ ఆయనతో బ్యాంకాక్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఫొటో ఫ్రేమ్‌ను మోదీకి యూనస్ బహుమతిగా ఇచ్చారు. 2015లో 102వ సైన్స్ కాంగ్రెస్ సభలో యూనస్‌కు మోదీ గోల్డ్ మెడల్ బహూకరించారు. ఆ ఫొటోనే యూనస్ ఫ్రేమ్ చేయించి గిఫ్ట్‌గా ఇచ్చారు. కాగా.. ఇరు దేశాల మధ్య విభేదాల నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.
News April 4, 2025
MBNR: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్‌గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ శాఖ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. చిన్నచింతకుంట మండలం పర్కాపూర్ గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి ఉస్మానియాలో MA సోషియాలజీ పూర్తి చేశారు. 2009లో దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు.
News April 4, 2025
బర్డ్ ఫ్లూతో చిన్నారి మరణం.. రంగంలోకి కేంద్రం

AP: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో <<15964152>>తొలి మరణం<<>> సంభవించడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీ, ముంబై, మంగళగిరి ఎయిమ్స్‌కు చెందిన పలువురు డాక్టర్లతో కలిసి అధ్యయనం చేయిస్తోంది. నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి ఎప్పుడు అనారోగ్యానికి గురైంది? ఎప్పుడు ఆస్పత్రిలో చేరింది? వైద్యులు ఎలాంటి చికిత్స అందించారు? అనే వివరాలను ఆ బృందం ఆరా తీసింది. చిన్నారి కుటుంబీకులు చికెన్ కొనుగోలు చేసిన దుకాణంలో శాంపిల్స్ సేకరించింది.