News January 31, 2025

తిరుమలలో సర్వభూపాల వాహనం ట్రయల్ రన్

image

శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్ఠతను పరిశీలించేందుకు గురువారం టీటీడీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారు విహరించే అన్ని వాహనాల్లోకి సర్వభూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈ వాహన సేవ సమయంలో వాహనబేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు.

Similar News

News December 3, 2025

WNP: ఒకే వార్డుకు తండ్రికొడుకులు పోటీ

image

ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ గ్రామపంచాయతీ నాలుగో వార్డుకు తండ్రి కొడుకులు పోటీపడుతున్నారు. కొడుకు ఏ సాయికుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా, తండ్రి తిరుపతయ్య కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఓటర్లలో నెలకొంది.

News December 3, 2025

వెనిజులాపై అతి త్వరలో దాడి చేస్తాం: ట్రంప్

image

మొన్నటి వరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. వెనిజులాపై త్వరలో దాడులు చేస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు అమెరికాలోకి రవాణా చేస్తున్న ఏ దేశానికైనా సైనిక చర్య తప్పదన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ బోట్లపై US జరిపిన దాడుల్లో 80 మందికి పైగా చనిపోయారు. వెనిజులాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంతర్జాతీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

News December 3, 2025

MDK: సర్పంచ్, వార్డు అభ్యర్థుల గుర్తులు ఎలా కేటాయిస్తారో తెలుసా..?

image

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ చేసుకోవచ్చు. గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న వారికి గుర్తుల కేటాయింపు ప్రారంభమవుతుంది. అయితే ఈసారి గుర్తుల కేటాయింపు తెలుగు అక్షర క్రమానుసారం జరుగుతుంది. నామినేషన్ పత్రంలో అభ్యర్థి పేరు ఎలా నమోదు అయిందో, ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తులను కేటాయిస్తారు.