News September 17, 2024

తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం

image

తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని FactCheck.AP.Gov.in పేర్కొంది. వాస్తవానికి ఆగస్టు 29వ తేదీన విజయవాడ గురునానక్ కాలనీలో, మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన కుమారుడి పుట్టిన రోజు ఫంక్షన్ వీడియో ఇది అని తెలిపింది. తిరుమల ప్రతిష్ట మంటగలిపేందుకు తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని ట్విటర్‌లో తెలిపింది.

Similar News

News October 11, 2024

తిరుపతి: ‘మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే వంట నూనె’

image

మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే వంట నూనెలు వినియోగదారులకు అందజేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌తో కలిసి తిరుపతిలోని బేరు వీధిలోని గోపి కృష్ణ ఆయిల్ స్టార్‌లో రూ.135 విలువగల పాముయిల్‌ను రూ.117కు అందజేశారు. అలాగే రూ.145 విలువ గల సన్ ఫ్లవర్ ఆయిల్‌ను రూ.128కు వినియోగదారులకు అందజేశారు.

News October 10, 2024

ప్రియుడిపై కోపంతో కళ్లీ పాలు తాగిన యువతి

image

ప్రియుడు మరొకరితో చనువుగా ఉండటం జీర్ణించుకోలేక ఓ యువతి కళ్లీ పాలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన(21) ఏళ్ల యువతి ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ అక్కడ ఉన్న ఓ యువకుని ప్రేమలో పడింది. కొంతకాలం ఇద్దరూ చనువుగా ఉన్నారు. తనను కాదని అదే షాపులో పనిచేసే మరో యువతిని తన ప్రియుడు ప్రేమిస్తున్నాడని కళ్లీ పాలు తాగింది.

News October 10, 2024

వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు శ్రీసిటీ ఎండీ ఘన నివాళి

image

గొప్ప దార్శినికతకు, భారతీయ పరిశ్రమకు, దాతృత్వానికి మారుపేరైన టాటా సన్స్ గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ నావల్ టాటా మృతి పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ మహోన్నత వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, తరతరాలకు స్ఫూర్తినిచ్చే దార్శనికుడిని భారతదేశం కోల్పోయిందని పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ 16న రతన్ టాటా శ్రీ సిటీని సందర్శించారు.