News January 9, 2025
తిరుమల తొక్కిసలాట ఘటనపై స్పందించిన భూమన
వివాదాస్పద వ్యక్తులకు TTD పాలనా పగ్గాలు ఇస్తే ఇలాగే ఉంటుందని మాజీ ఛైర్మన్ భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆయన మాట్లాడుతూ.. టీడీడీ చరిత్రలో ఇదో చీకటి రోజని, CM చంద్రబాబు పాలనా వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. ఇప్పటికీ పుష్కరాల ఘటన వెంటాడుతుందన్న ఆయన తాజా ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. YCP పాలనలో ఎన్నడూ ఇలా జరగలేదని TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి అన్నారు.
Similar News
News January 25, 2025
రంగంపేట క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి స్పాట్ డెడ్
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన రంగంపేట క్రాస్ వద్ద చోటుచేసుకుంది. తేనేపల్లి పంచాయతీ బీదరామిట్టకు చెందిన నవీన్ అనే యువకుడు రంగంపేట క్రాస్ గువ్వల కాలనీ సమీపంలో నడుచుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
News January 24, 2025
చిత్తూరులో చీటింగ్ కేసు నమోదు
2000 వ సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వ టెండరు దక్కించుకొని సక్రమంగా పంపిణీ చేయని చర్చి వీధికి చెందిన శ్రీ షిరిడి సాయి ఎంటర్ప్రైజెస్ అధినేత కామేశ్వరరావుపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేస్తామని సీఐ జయరామయ్య తెలిపారు. 25 ఏళ్లుగా కేసు నడుస్తున్నప్పటికీ వాయిదాకు గైర్హాజరు కావడంతో నేడు దండోరా వేశామన్నారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
News January 24, 2025
తిరుమలలో పలు సేవలు రద్దు
రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఫిబ్రవరి 4వ తేదీన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. NRIలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.