News January 12, 2025

తిరుమల పరకామణిలో దొంగతనం

image

తిరుమల పరకామణిలో టీటీడీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీవారి హుండీలో బంగారం దొంగతనం చేశారు. అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకువెళుతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అతను గతంలో కూడా ఏమైనా దొంగతనాలు చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 15, 2025

పింఛన్ల పునఃపరిశీలన మూడు రోజులు పాటు బంద్

image

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పింఛన్ల పునఃపరిశీలన కార్యక్రమాన్ని మూడు రోజులు పాటు నిలిపివేసినట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులు పాటు పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సచివాలయ సంబంధ శాఖ అధికారులు దివ్యాంగులకు తెలియజేయాలని సూచించారు.

News October 15, 2025

నెల్లూరు TDP నేతల తీరుపై పల్లా ఆగ్రహం..?

image

జిల్లా TDP నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడంపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలకు ఫోన్లు చేసి పార్టీ క్రమశిక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, దానిని కాపాడుకోవాలని హితవు పలికారట.

News October 14, 2025

అనధికార MIHM ఫంక్షన్ హాల్ సీజ్

image

హై కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని కోటమిట్టలో ఉన్న అన్నధికారికంగా చేపట్టిన MIHM ఫంక్షన్ హాల్‌ను కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. దీని తరువాత కార్యాచరణ నిమిత్తం దీన్ని ఫంక్షన్ హాల్ యాజమాన్యం సమక్షంలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఎలక్ట్రికల్ సిబ్బంది సీజ్ చేయడం చేశారు.