News January 12, 2025

తిరుమల పరకామణిలో దొంగతనం

image

తిరుమల పరకామణిలో టీటీడీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీవారి హుండీలో బంగారం దొంగతనం చేశారు. అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకువెళుతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అతను గతంలో కూడా ఏమైనా దొంగతనాలు చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 24, 2025

జనవరి నుంచి చిత్తూరు మరింత చిన్నదాయే.!

image

జనవరి ఫస్ట్ వీక్‌లో మదనపల్లె జిల్లాను ప్రారంభించే అవకాశం ఉంది. CTR, అన్నమయ్య జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాల కోసం కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదట. దీంతో మదనపల్లె జిల్లా ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెతోపాటూ పుంగనూరు నియోజకవర్గాల్లోని 19 మండలాలతో కొత్త జిల్లా ఏర్పడనుంది. చిత్తూరు జిల్లా 32 మండలాల నుంచి 28కి పరిమితం కానుంది.

News December 23, 2025

పుంగనూరు: అనపకాయలకు భలే డిమాండ్

image

చిత్తూరు జిల్లాలో ఈ సీజన్‌లో అనపకాయలు విరివిగా లభిస్తాయి. పలువురు రైతులు వీటిని ప్రధాన పంటగా, అంతర్ పంటగా భూముల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం రైతులు కిలో రూ.50 చొప్పున మార్కెట్లో విక్రయిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రానికి ఇవి ఎగుమతి అవుతున్నాయి. అనప గింజలు, పితికి పప్పు కూరను పలువురు ఇష్టంగా తింటారు. అలాగే వీటిని నూనెలో వేయించి స్నాక్స్‌గా కూడా వాడుతారు.

News December 23, 2025

నగరిలో టీడీపీ నేత అక్రమాలు: YCP

image

నగరి ఎమ్మెల్యే అండతో టీడీపీ నేత భారీగా రేషన్ అక్రమ రవాణా చేశారని వైసీపీ ఆరోపించింది. నిండ్రలోని నెట్టేరి వద్ద తనిఖీల్లో 4 టన్నుల రేషన్ బియ్యంతో టీడీపీ ఎస్సీ సెల్ నేత అల్లిముత్తు పట్టుబడినట్లు తెలిపింది. తర్జనభర్జనల తర్వాత అల్లిముత్తు , కార్తీక్‌ , విక్రమ్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, సీజ్ ద షిప్ అనే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించింది.