News April 13, 2025
తిరుమల: పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు తెల్లరంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది. టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న TTDసిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేసింది.
Similar News
News November 21, 2025
వరంగల్లో దిశా కమిటీ సమావేశం

వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ‘దిశా’ (జిల్లా అభివృద్ధి సహకార & మానిటరింగ్ కమిటీ) సమావేశానికి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ రామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
News November 21, 2025
ఈనెల 24 నుంచి మీకోసం రైతన్న కార్యక్రమాలు: కలెక్టర్

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈనెల 24 నుంచి మీకోసం రైతన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మీకోసం రైతన్న కార్యక్రమాన్ని ప్రతి మండలంలో నిర్వహిస్తూ రైతు అభ్యున్నతికి సూచనలు సలహాలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
News November 21, 2025
నర్సంపేట: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పట్టణంలోని అంగడి సెంటర్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటో నడుపుతున్న పట్టణానికి చెందిన మేకల మహేందర్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు మహేందర్ను నర్సంపేట న్యాయస్థానంలో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.


