News April 13, 2025
తిరుమల: పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు తెల్లరంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్‌పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది. టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న TTDసిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేసింది.
Similar News
News April 20, 2025
VZM: మహిళ దారుణ హత్య

విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం. పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభీమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
ఎన్టీఆర్: CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టర్- ల్యాండ్స్, జూనియర్ లైవిలీహుడ్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు శనివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలని ఆయన సూచించారు.
News April 20, 2025
ముస్తాబాద్: రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్సీ

అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వర్షాలతో నష్టపోయిన పంటలను శనివారం ఎమ్మెల్సీ అంజిరెడ్డి పరిశీలించారు. నష్టపోయిన పంటలను, మామిడి తోటలను పరిశీలించారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి బాధిత రైతులను ఆదుకోవాలన్నారు.