News June 18, 2024
తిరుమల : పుకార్లను నమ్మవద్దు.. టీటీడీ విజ్ఞప్తి

వయోవృద్ధుల దర్శనార్థం వారి టికెట్లకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది పూర్తిగా అబద్దమని, ఇటువంటి ఫేక్ న్యూస్ భక్తులు నమ్మొద్దని TTDవిజ్ఞప్తి చేసింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం TTD ప్రతినెల 23న 3నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోందన్నారు. www.tirumala.org, https://ttdevastanams.ap.inను మాత్రమే సంప్రదించగలరన్నారు.
Similar News
News November 24, 2025
చిత్తూరు: ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

కార్వేటినగరం(M) సురేంద్రనగరం కనుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్, లోడ్పై కూర్చుని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ కనుమ కాలువలో పడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 24, 2025
చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

టమాటా ధరల పెరుగుదలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. నాణ్యత కలిగిన టమాటా ధరలు మొదటి రకం 10 కిలోలు ములకలచెరువు- రూ.510, పుంగనూరు-రూ.100, పలమనేరు- రూ.480, వీకోట-రూ.500 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా పంట తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
News November 24, 2025
చిత్తూరు: మట్టి కోసం TDP పరువు తీసేస్తున్నారు..!

చిత్తూరు జిల్లాలో గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. పూతలపట్టులో గ్రావెల్ తరలింపు విషయంలో TDP నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారట. ఇదే విషయమై ఐరాలకు చెందిన ఓ TDP కార్యకర్త ఆడియో వైరల్గా మారింది. గ్రావెల్ విషయమై TDPలో వర్గాలు ఏర్పడినా MLA మౌనంగా ఉండటాన్ని కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారట. తిరుపతి జిల్లాలోనూ <<18368996>>గ్రావెల్ <<>>తరలింపు జోరుగా జరుగుతోంది.


