News January 31, 2025

తిరుమల మాడ వీధుల్లో తనిఖీలు చేసిన టీటీడీ ఛైర్మన్ 

image

తిరుమలలో ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్యాలరీలలోని భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా సమాచారం చేరవేసేలా ప్రకటనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. భక్తులు గ్యాలరీలోకి ప్రవేశించాక వారికి కావాల్సిన అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను క్రమం తప్పకుండా అందించాలని కోరారు.

Similar News

News October 18, 2025

ఒంటిమిట్టకు తిరుమల లడ్డూలు

image

ఒంటిమిట్ట రామాలయానికి వచ్చే భక్తులకు 600 తిరుమల లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారి నవీన్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కోటి రూ.50గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పొందవచ్చన్నారు.

News October 18, 2025

సంగారెడ్డి: గురుకులాల్లో మిగుల సీట్ల భర్తీ

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతి వరుకు గల ఖాళీలను భర్తీ చేయనున్నారు. విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల ఇస్నాపూర్ హెచ్ఎం జయలక్ష్మి తెలిపారు. దరఖాస్తులను ఇస్నాపూర్ బాలికల పాఠశాలలో ఈ నెల 22 మధ్యాహ్నం లోపు అందజేయాలని సూచించారు.

News October 18, 2025

చెత్త వెస్తే జరిమానా విధించడం: కలెక్టర్ హెచ్చరిక

image

ఏలూరు జిల్లాలోని కాల‌వ‌ల్లో, రోడ్డు ప్ర‌క్క‌న కొందరు చెత్త వేస్తున్నారని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మండిపడ్డారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లో వెట్రిసెల్వి మాట్లాడారు. నగరం, పట్టణం, పల్లెల్లో యథేచ్చగా ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులకు ఆదేశించారు. చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి అన్ని ప్రాంతాల వారు సహకరించాలని కలెక్టర్ కోరారు.