News January 25, 2025
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు బోల్తా

తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద కారు బోల్తా పడింది. తమిళనాడుకు చెందిన భక్తులు శనివారం ఉదయం మొదటి ఘాట్ రోడ్లో దిగుతుండగా బోల్తా పడటంతో భక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Similar News
News October 29, 2025
49 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్‌లో 49 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్, ITI, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590, SC/ST/PWBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://bdl-india.in/
News October 29, 2025
సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మహేశ్ మేనకోడలు మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ SMలో ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. గతంలో ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో జాన్వీ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. మూవీస్‌లోకి రావాలని ఆమె డ్రైవింగ్, డాన్స్, ఫిట్నెస్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.
News October 29, 2025
మణుగూరులో వ్యక్తి సూసైడ్

మణుగూరులోని సి-టైప్ గేట్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మల్లం శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


