News February 4, 2025
తిరుమల: రథసప్తమి.. పోలీసులకు ఎస్పీ సూచనలు

TTD ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని జిల్లా హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సోమవారం బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందికి తిరుమల ఎస్.వి హై స్కూల్ గ్రౌండ్‌లో పలు సూచనలు చేశారు. పోలీసులు భక్తులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. రథసప్తమి రోజున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News February 19, 2025
నిద్ర చెడగొడుతోందని కోడిపై RDOకు ఫిర్యాదు..

పొద్దున 3 గంటలకు అదే పనిగా కూస్తోందని కేరళ, పల్లిక్కల్ వాసి రాధాకృష్ణ కురూప్ ఓ కోడిపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కొన్నాళ్లుగా నిద్రను చెడగొడుతూ ప్రశాంతమైన తన జీవితానికి భంగం కలిగిస్తోందని ఆయన స్థానిక RDOకు మొరపెట్టుకున్నారు. దానిని సీరియస్‌గా తీసుకున్న అధికారి వెంటనే ఇంటికొచ్చి పరిశీలించారు. పక్కింటి మేడపై కోళ్ల షెడ్డును గమనించి దానిని 14 రోజుల్లో మరోచోటకు మార్చాలని ఆదేశించారు.
News February 19, 2025
మహబూబాబాద్: అధికారులతో సమీక్షించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ అద్వైత్ కుమార్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ రంగానికి, తాగునీటికి నిర్మాణ రంగానికి నిధులు కేటాయించామని అన్నారు. ఎండాకాలంలో ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ పథకం అందేలా చూడాలని అధికారులకు తెలిపారు.
News February 19, 2025
త్వరలో.. బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పెంపు!

బ్యాంకు కస్టమర్లకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం డిపాజిట్లపై ఉన్న ఇన్సూరెన్స్ కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.8-12 లక్షలకు పెంచబోతోందని సమాచారం. ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తోందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు చెప్పినట్టు మనీకంట్రోల్ తెలిపింది. ఈ నెలాఖరు నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రావొచ్చని పేర్కొంది. ఫిక్స్‌డ్, సేవింగ్స్, కరెంట్, రికరింగ్ A/Cకు ఇవి వర్తిస్తాయంది.