News February 3, 2025
తిరుమల: ‘రథసప్తమి వేడుకలను విజయవంతం చెయ్యండి’

ఈనెల 04వ తేదీన జరగనున్న తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకల నిర్వహణపై జిల్లా పోలీసు భద్రతాపరమైన ఎలాంటి ఆటంకాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అధికారులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అదే సమయంలో విధుల్లో ఉన్న ఇతర శాఖల అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
Similar News
News February 19, 2025
అయినవిల్లి : పాము కాటుకు గురైన వ్యక్తి సేఫ్

అయినవిల్లి మండలం వీరవల్లిపాలేనికి చెందిన రామకృష్ణ మంగళవారం తాచుపాము కాటుకు గురయ్యాడు. అతణ్ని గ్రామ సర్పంచ్ బుచ్చిబాబు, పంచాయతీ సభ్యుడు నరసింహమూర్తి అయినవిల్లి PHCకి తరలించారు. డాక్టర్ మంగాదేవి సిబ్బందిని సమన్వయం చేస్తూ సకాలంలో వైద్యం అందించారు. దీంతో అతనికి ప్రమాదం తప్పి, ప్రాణాలు కాపాడుకున్నారు.
News February 19, 2025
పాలకొండ రానున్న వైఎస్ జగన్

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పాలకొండ రాబోతున్నట్లు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మంగళవారం తెలిపారు. ఇటీవల మరణించిన వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని జగన్ పరామర్శించినున్నట్లు వారు వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రానున్నారని.. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 19, 2025
శివాజీ జయంతి: హోరెత్తనున్న హైదరాబాద్

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉత్సవాలకు హైదరాబాద్ ముస్తాబైంది. హిమాయత్‌నగర్, గోషామహల్, రాంనగర్, అంబర్‌పేట, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మల్కాజిగిరిలో హిందూ ఏక్తా ర్యాలీలు నిర్వహించనున్నారు. శివాజీ మహారాజ్ భారీ విగ్రహాలను సిటీలో ఊరేగిస్తారు. జై భవాని.. జై శివాజీ నినాదాలతో నేడు భాగ్యనగరం హోరెత్తనుంది.