News February 10, 2025

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నలుగురు అరెస్టు

image

లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో CBI నలుగురిని అరెస్టు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ‘X’ వేదికగా పేర్కొన్నారు. భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పునబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ(దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేసినట్లు అందులో పేర్కొన్నారు.

Similar News

News March 26, 2025

KMR: బాలుడి అమ్మకం కేసును ఛేదించిన పోలీసులు

image

కామారెడ్డిలోని వీక్లీ మార్కెట్లో కంస్యపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమకు పుట్టిన మగ బిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల విషయంలో వాగ్వాదం రావడంతో స్థానికులు తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి బాలుడిని అప్పగించారు. పెట్రోలింగ్ , బ్లూకార్డ్ సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.

News March 26, 2025

ప.గో: వైసీపీకి షాక్ తప్పదా..?

image

ప.గో జిల్లాలో వైసీపీకి షాక్ ఇవ్వడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. యలమంచిలో 18 ఎంపీటీసీలకు గాను వైసీపీ 13, జనసేన 1, టీడీపీ 3 చోట్ల గెలిచింది. ఓ సీటు ఖాళీగా ఉంది. అత్తిలిలో టీడీపీకి 5, వైసీపీకి 15 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఆ రెండు చోట్లు ఐదారు మందిని కూటమిలోకి లాగి ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడానికి NDA నాయకులు పావులు కదుపుతున్నారు.

News March 26, 2025

గ్రేటర్‌లో స్ట్రీట్ లైట్లకు త్వరలో యాప్

image

గ్రేటర్‌ హైదరాబాద్‏లోని పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొందన్న ఫిర్యాదులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. వీటి మెరుగైన నిర్వహణకు సాంకేతికత వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కమిషనర్‌ ఇలంబర్తి తెలిపారు.

error: Content is protected !!