News May 24, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల వేసవి రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం దర్శనానికి 20 గంటలు పట్టవచ్చని టీటీడీ అధికారుల అంచనా వేస్తున్నారు. గురువారం శ్రీవారిని 65,416 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.3.51 కోట్లు వచ్చాయి. స్వామివారికి 36,128 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి దర్శనం కోసం శిలా తోరణం వరకు క్యూలైన్ ఉంది. వేసవి రద్దీ దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Similar News

News November 17, 2024

గుర్రంకొండ ASI మోసెస్‌పై కేసు నమోదు

image

గుర్రంకొండ ASI మోసెస్‌పై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రెండో పట్టణ SI రవి కుమార్ తెలిపారు. ఏఎస్ఐ మోసెస్ 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటూ తనను పట్టించుకోకపోవడమే కాకుండా అదనపుకట్నం కోసం వేధిస్తున్నాడని ఆయన భార్య ఎస్తర్ రాణి శనివారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రామచంద్ర ఆదేశాలతో ఎస్ఐ విచారణ చేపట్టి ఏఎస్ఐపై కేసు చేశారు. 

News November 17, 2024

నేడు నారావారిపల్లెకు CM రాక.. వివరాలు ఇవే 

image

చంద్రగిరి మాజీ MLA నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియల నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు వస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 9.20కు హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి 9.25కు బేగంపేట ఎయిర్పోర్టుకు రానున్నారు. అక్కడ నుంచి 10.10గంటలకు తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన 10.50 గంటలకు నారావారిపల్లెకు చేరుకుని అంత్యక్రియలలో పాల్గొననున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

News November 16, 2024

బి.కొత్తకోట: క్షుద్రపూజలు చేస్తున్న వైసీపీ నేతలు అరెస్ట్

image

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోటలో క్షుద్ర పూజలు నిర్వహించిన ఇద్దరు వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినట్లు మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. అరెస్టైన వారిలో ఒకరు మదనపల్లె చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యుడు ఏ.వీ సుబ్బారెడ్డి కాగా మరొకరు కదిరికి చెందిన వజ్ర భాస్కరరెడ్డి ఉన్నారు. బి.కొత్తకోట మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ పురాతన ఆలయంలో పూజలు నిర్వహించగా అరెస్టుచేశామని తెలిపారు.