News December 20, 2024
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం

తిరుమలలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. దీనికి సంబంధించి శ్రీవాణి, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. టికెట్ల విడుదల తేదీలు(ఆయా రోజుల్లో ఉదయం 11 గంటలకు) ఇవే..
➤శ్రీవాణి టికెట్లు: డిసెంబర్ 23న
➤రూ.300 టికెట్లు: డిసెంబర్ 24న
➤మార్చి నెల శ్రీవాణి టికెట్లు: డిసెంబర్25న
➤మార్చి నెల రూ.300 టికెట్లు: డిసెంబర్ 26న
Similar News
News October 18, 2025
చిత్తూరు: ఈ నెల 21న హాలిడే కోసం వినతి

ఈ నెల 20న దీపావళి పండుగ సందర్భంగా మరుసటి (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటించాలని APTF నాయకులు విద్యాశాఖాధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ కార్యాలయంలో AD సుకుమార్ను కలిసిన APTF నాయకులు ఆరోజు పలువురు కేదారేశ్వర స్వామి వ్రతం నిర్వహించుకుంటారని, కావున సెలవు ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుుంటారో వేచి చూడాలి.
News October 18, 2025
హంద్రీనీవాతో కుప్పం సస్యశ్యామలం

హంద్రీనీవాతో కుప్పం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. శాంతిపురం (M) దండి కుప్పం చెరువు కృష్ణ జలాలతో నిండి మరవ పోవడంతో శుక్రవారం టీడీపీ నేతలు జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కుప్పంకు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు మరో భగీరథ ప్రయత్నం చేశారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు జేజేలు పలుకుతూ నినాదాలు చేశారు.
News October 17, 2025
చిత్తూరు: విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి

తెలంగాణ(S) కామారెడ్డి(D) నాగిరెడ్డి పేటలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు(D) రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు బాతులను మేపుకుంటూ వెళ్తుండగా కొన్ని బాతులు పొలంలోకి వెళ్లాయి. వాటిని తీసుకురావడానికి వెళ్లగా పొలంలో స్టాటర్ డబ్బా వైర్లు అతని కాలుకు తగిలి షాక్కు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.