News April 13, 2025

తిరుమల: PIC OF THE DAY 

image

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి శ్రీవారి ఆనంద నిలయం చంద్రుని కాంతిలో మెరిసిపోయింది. పౌర్ణమి చంద్రుడు ఆలయ శిఖరంపై తన ప్రకాశాన్ని విరజిమ్ముతూ భక్తులను మంత్ర ముగ్ధులను చేశాడు. ‘ఓ చంద్రమా, నా ఆనంద నిలయం నుంచి ప్రపంచానికి చల్లటి నీడను ఇవ్వు’ అన్న భావనను నిజం చేస్తూ తిరుగిరులపై చంద్రుని చల్లని వెలుగు పరచుకుంది. 

Similar News

News April 15, 2025

UPDATE.. కింగ్‌డమ్ డబ్బింగ్ స్టార్ట్

image

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్‌డమ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభమైనట్లు హీరో విజయ్ దేవరకొండ ఇన్‌స్టా స్టోరీలో తెలిపారు. ఇప్పటికే సగం పార్ట్ పూర్తయిందని వెల్లడించారు. విజయ్ స్టోరీని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. మే 30న సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు-హీరో సిద్ధమయ్యారని రాసుకొచ్చింది.

News April 15, 2025

WGL: పసుపు క్వింటా రూ.13,909

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల చిరుధాన్యాలు, సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు రూ.26 వేలు పలకగా.. దీపిక మిర్చి రూ.12,000 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి రూ.9,300, మక్కలు(బిల్టీ) రూ.2,350, పసుపు క్వింటాకి రూ.13,909 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

News April 15, 2025

రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

image

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ పేర్లను చేర్చినందుకు నిరసనగా రేపు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల పీసీసీలకు లేఖ రాసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలందరూ వీటిలో పాల్గొనాలని పేర్కొంది.

error: Content is protected !!