News November 12, 2024
తిరువూరులో అర్ధరాత్రి విషాదం

తిరువూరులో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తిరువూరు లక్ష్మీపురానికి చెందిన ఇస్మాయిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన ఇంటి ఆవరణంలో ఉన్న పాకలో మంచం మీద పడుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో విద్యుత్ షాక్ తో ఇంటి పూరీపాక కాలిపోవడంతో పడుకున్న ఇస్మాయిల్ కూడా కాలిపోయాడు. స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగా వచ్చి మంటలను అర్పివేశారు.
Similar News
News October 9, 2025
ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సీజన్ 2025 -26 సంవత్సరానికి సంబంధించి ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పెనమలూరు మండలం పోరంకిలోని 3వ సచివాలయం నుంచి వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం సేకరణకు చేపట్టాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
News October 8, 2025
పెనమలూరు: భర్త మందులు తీసుకురాలేదని ఆత్మహత్య

కానూరులో నివాసం ఉంటున్న మధులత 5ఏళ్ల నుంచి సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. భర్త నాగేశ్వరరావుకు మందులు తీసుకురమ్మని వాట్సాప్లో చీటీ పెట్టగా.. అందులో అండర్ లైన్ చేసిన మందు మాత్రమే భర్త తీసుకువచ్చాడు. అన్ని మందులు తేకుండా ఒక ముందు మాత్రమే తెచ్చాడని భర్తను ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్థాపానికి గురైన మధులత ఇవాళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 8, 2025
MTM: 10, 11న జీఎస్టీ ఎగ్జిబిషన్

‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా, ఈ నెల 10, 11 తేదీలలో ఎలక్ట్రానిక్ వస్తువులతో కూడిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను నిర్వహించాలని కలెక్టర్ బాలాజీ సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, వినియోగదారులకు తగ్గింపు ధరల్లో వస్తువులు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.