News April 4, 2025

తిరువూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

తిరువూరులో శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుపేటలో నివాసం ఉంటున్న షేక్ సుభాని అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢొకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News April 22, 2025

ఇన్‌స్టాలో RCB మరో మైలురాయి

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో ఆర్సీబీ ఫ్రాంచైజీ మరో మైలురాయి చేరుకుంది. అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ టీమ్‌కు 19 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత CSK (18.3M), MI(17M), KKR(7.3M), SRH (5.4M), RR(4.9M), GT (4.7M), DC (4.5M), PBKS(4M), LSG (3.6M) ఉన్నాయి.

News April 22, 2025

మెదక్: ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా.!

image

మెదక్ జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో విద్యార్థులు 49.21% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6,153 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,028 పాస్ అయ్యారు. 3125 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 39.09 % కాగా, బాలికలు 57.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు పైచేయి సాధించడంతో జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

News April 22, 2025

నకిలీ పోలీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సాధారణ దుస్తులు ధరించి పోలీసుల పేరు చెప్పి ఎవరైనా వాహనాలు తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లయితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. పోలీసు సిబ్బంది ఎవరు కూడా సివిల్ డ్రెస్‌లో వాహనాలు తనిఖీ చేయరని అన్నారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ఖాకీ యూనిఫామ్ ధరించి వాహనాల తనిఖీలు చేస్తారని తెలిపారు. సివిల్ డ్రెస్‌లో తనిఖీ నిర్వహించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

error: Content is protected !!