News April 4, 2025

తిరువూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరులో శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుపేటలో నివాసం ఉంటున్న షేక్ సుభాని అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News April 8, 2025

కృష్ణా జిల్లాలో 37 మందికి గ్రేడ్-3 కార్యదర్శులుగా పదోన్నతి

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 37 గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్న 19 మంది, జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న 18 మంది జూ.అసిస్టెంట్లను గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సంబంధిత పదోన్నతులు పొందిన కార్యదర్శులకు కలెక్టర్ అందజేశారు.

News April 8, 2025

గుడివాడ: మందుబాబులపై లోకేశ్ సెటైరికల్ పోస్ట్

image

గుడివాడలో ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. `పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. సారీ గాయ్స్‌.. నేను మీకు ఎలాంటి హెల్ప్‌ చేయలేకపోతున్నా.. ఎందుకంటే ఏపీ పోలీసులు వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు’ అని X లో పోస్ట్ చేశారు.

News April 8, 2025

కృష్ణా: పవన్ కళ్యాణ్‌పై పోతిన మహేశ్ ఫైర్

image

పెందుర్తిలో DCM పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా 30 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయలేకపోయారని వైసీపీ నేత పోతిన మహేశ్ సోమవారం ట్వీట్ చేశారు. మాటలు, సూక్తులు చెప్పడం కాదని, ఆచరణలో చేసి చూపించాలని ఫైరయ్యారు. ఈ ఘటనకి బాధ్యత మీది కాదా? తప్పు చేసేది ఒకరు, శిక్షపడేది మరొకరికా? ఇదెక్కడి న్యాయం? అంటూ పవన్‌ను ప్రశ్నించారు.

error: Content is protected !!