News March 29, 2025

తిరువూరు: అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన కొలికపూడి వ్యవహారం

image

తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం TDP అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఆ పార్టీ నేత రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం ప్రకటించారు. నేటి ఉదయం11 గంటలకు ఆయన విధించిన డెడ్‌లైన్ పూర్తికానుంది. దీంతో ఆయన ఏం చేస్తారనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా మరోవైపు కొలికపూడి తీరుపై అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. మీరేమనుకుంటున్నారో COMMENT చేయండి.

Similar News

News November 24, 2025

ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం

image

ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సొంతిల్లు కట్టుకోవాలనుకున్న పేదలకు పెరిగిన ఇసుక, ఇటుక ధరలు గుదిబండగా మారాయి. ఖమ్మం జిల్లాలో ఇసుక రూ.8 వేల నుంచి రూ.12 వేలు, ఇటుక రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తుండటంతో నిర్మాణం భారమైంది. ‘దేవుడు కరుణించినా, వ్యాపారులు కరుణించలేదు’అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 24, 2025

మండపేటలో మంత్రి పర్యటన రద్దు

image

మంత్రి నాదెండ్ల మనోహర్ మండపేట పర్యటన రద్దయిందని ఏపీ ఐఐసీ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ తెలిపారు. మంత్రి మంగళవారం మండపేటలో సూర్య కన్వెన్షన్ హాల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల కార్యక్రమం రద్దు చేశారు. మళ్లీ ఎప్పుడు ఉంటుందో త్వరలో చెప్తామన్నారు.

News November 24, 2025

రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

image

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.