News March 29, 2024

తిరువూరు: పోలీస్ గన్‌మెన్ మోహన్ మృతి

image

తిరువూరు మండలం కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోలీస్ గన్‌మెన్ మారిపోగు మోహన్ రోడ్డు ప్రమాదంలో గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. విజయవాడ లాండ్ ఆర్డర్ డీసీపీ వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న మోహన్ బైకు మీద తిరువూరు వైపు వస్తుండగా మంగళగిరి వడ్డేశ్వరం వద్ద వెనక నుంచి టిప్పర్ ఢీకొనడంతో మోహన్ మృతిచెందాడు. మోహన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 14, 2025

ఇందిరాగాంధీ స్టేడియంలో కబడ్డీ, వాలీబాల్ జట్ల ఎంపిక

image

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-19 కబడ్డీ, వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.

News October 14, 2025

విజయవాడలో అండర్-19 బాడ్మింటన్ జట్ల ఎంపిక

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 16న విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలోని బాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలన్నారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.

News October 14, 2025

కృష్ణానది నుంచి నేరుగా రక్షిత తాగునీరు: ఎంపీ

image

జల్‌జీవన్ పథకం కింద కృష్ణానది నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంటింటికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) తయారు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాలాజీతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నారు.