News March 29, 2024
తిరువూరు: పోలీస్ గన్‌మెన్ మోహన్ మృతి
తిరువూరు మండలం కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోలీస్ గన్‌మెన్ మారిపోగు మోహన్ రోడ్డు ప్రమాదంలో గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. విజయవాడ లాండ్ ఆర్డర్ డీసీపీ వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న మోహన్ బైకు మీద తిరువూరు వైపు వస్తుండగా మంగళగిరి వడ్డేశ్వరం వద్ద వెనక నుంచి టిప్పర్ ఢీకొనడంతో మోహన్ మృతిచెందాడు. మోహన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 22, 2025
ప్రకృతి వ్యవసాయం దిశగా ముందడుగు వేయాలి: కలెక్టర్
సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించి, ఆదాయం పెంచే లక్ష్యంతో పొలం పిలుస్తోంది పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంతో రైతులను చేయిపట్టి నడిపిస్తోందని కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం, దాములూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఎలా ఉంది.? సాగుచేస్తున్న పంటలు గురించి అడిగి తెలుసుకున్నారు.
News January 22, 2025
దుర్గగుడి ప్రధానార్చకులు మృతి
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గగుడిలో చాలా సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న ప్రధానార్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మరణించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య రీత్యా మరణించినట్లు సమాచారం.
News January 22, 2025
జి.కొండూరు: ప్రేయసి వెళ్లిపోయిందని సూసైడ్
ఇద్దరు పిల్లలున్న ప్రేయసి కాదన్నదని జి.కొండూరులోని చెర్వుమాధవరానికి చెందిన ఇద్దరు పిల్లలకు తండ్రైన ఆటోడ్రైవర్ బాలాజీ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. మృతుడు మహిళతో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రేయసిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ మహిళ ఇకపై కలవడం కుదరదని వెళ్లిపోయింది. మనస్తాపంతో ఆటో స్టార్ట్ చేసే తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో మైలవరం సీఐ దర్యాప్తు చేపట్టామన్నారు.