News March 21, 2025
తిరువూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మార్పుపై ఉత్కంఠ

తిరువూరులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మార్పు అంశంపై వైసీపీ ఆచూతూచి అడుగులు వేస్తోంది. ఒప్పందం ప్రకారం ఛైర్‌పర్సన్ మార్పు అంశాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక నేతలు.. ఛైర్మన్‌ను మార్చడం వల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు కౌన్సిలర్లు పార్టీ మారుతారని లోకల్‌గా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మున్సిపల్ పీఠాన్ని YCP నిలబెట్టుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News April 24, 2025
సాలూరు: జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిని తేజస్వి

సాలూరు ప్రభుత్వ బాలికల హై స్కూల్ విద్యార్థిని పెద్దపూడి తేజస్వి బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్షల్లో 592 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తేజస్విని హృదయపూర్వకంగా అభినందించారు. తేజస్వి అత్యుత్తమ ప్రతిభతో జిల్లాలో మొదటి స్థానాన్ని సాధించడం గర్వకారణమన్నారు. ఆమె భవిష్యత్తు విద్యారంగంలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
News April 24, 2025
స్వచ్ఛతలో అనంతపురం జిల్లాకు అవార్డు

స్వచ్ఛ ఆంధ్ర అమలులో అనంతపురం జిల్లాకు అవార్డు దక్కింది. రాష్ట్రంలోనే తొలి స్థానంలో అనంతపురం, ద్వితీయ స్థానంలో సత్యసాయి జిల్లా నిలిచాయి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ ప్రకటించారు. నేడు విజయవాడలో జరగనున్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అవార్డును అందుకోనున్నారు.
News April 24, 2025
కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు: జగదీశ్ రెడ్డి

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు కలిగిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘ఇది బీఆర్‌ఎస్ సభనా, లేక టీఆర్‌ఎస్ సభనా అంటూ కాంగ్రెస్ నాయకులు ఆగమాగం అయితుండ్రు. సభకు కేసీఆర్ వస్తుండే. ఆల్‌రెడీ బీఆర్‌ఎస్ పేర ఎన్నికల్లో పోటీనే చేసినం. మీకెందుకు అనుమానం. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ప్రజలతోపాటు రైతులు లక్ష మంది తరలిరానున్నారు’ అని పేర్కొన్నారు.