News March 6, 2025
‘తీన్మార్ మల్లన్న ఏది మాట్లాడినా.. సీఎం వివరణ ఇవ్వాలి’

తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. రేవంత్ టీపీసీసీ చీఫ్, సీఎం కావాలని తీన్మార్ మల్లన్న బలంగా కోరుకున్నారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బలహీనపడుతుందనే కారణంగా రేవంత్కు టీపీసీసీ పదవి ఇవ్వాలని మల్లన్న కోరారని చెప్పారు. తీన్మార్ మల్లన్న ఏది మాట్లాడినా దానికి వివరణ రేవంత్ రెడ్డి ఇవ్వాలన్న వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
Similar News
News November 9, 2025
జడ్చర్లలో నకిలీ రూ.500 నోట్ల కలకలం

నకిలీ రూ.500 నోట్లతో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిని జడ్చర్ల మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో దుకాణ యజమాని పట్టుకున్నాడు. శనివారం దుకాణానికి వచ్చిన ఆ వ్యక్తి ఇచ్చిన మూడు నకిలీ రూ.500 నోట్లను యజమాని గుర్తించి నిలదీశాడు. వెంటనే యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
News November 9, 2025
పల్నాడు యుద్ధం ఎక్కడ జరిగిందో తెలుసా..!

మినీ మహాభారతం, ఆంధ్ర కురుక్షేత్రంగా చరిత్రకెక్కించిన పల్నాడు యుద్ధం జరిగిన ప్రాంతం ఎక్కడో తెలుసా? పల్నాడు జిల్లా కారంపూడిలోని నాగులేరు వాగు ఒడ్డునే ఆ చారిత్రక ఘట్టం జరిగింది. యుద్ధంలో రక్తపుటేరులు ప్రవహించినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, అప్పటి ఆయుధాలను పూజిస్తూ ఇక్కడ వీరుల గుడిని నిర్మించారు. ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం.
News November 9, 2025
ఏలూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు

ఏలూరు జిల్లాలోని జాతీయ రహదారులపై శనివారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రమాదాల నివారణలో భాగంగా హెవీ వాహన డ్రైవర్లకు ‘ఫేస్ వాష్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షలు నిర్వహించారు. రాత్రివేళల్లో లాడ్జీలు, బస్సు, రైల్వే స్టేషన్లలో కొత్త వ్యక్తుల వివరాలను ఆరా తీసి, అనుమానాస్పదంగా ఉన్న వారిని ప్రశ్నించారు.


